Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్

📰 Generate e-Paper Clip

70.13 శాతం నమోదైన పోలింగ్

అత్యధికంగా ధర్మపురిలో, అత్యల్పంగా మెట్ పల్లిలో పోలింగ్ నమోదు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 70.13 శాతం ఓటింగ్ నమోదయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ లో సాయంత్రం ఐదు గంటల వరకు 75.16 శాతం, జగిత్యాల మున్సిపల్ లో 69.60 శాతం, కోరుట్ల మున్సిపల్ లో 69.47 శాతం, మెట్ పల్లి మున్సిపల్ లో 69.21 శాతం, రాయికల్ మున్సిపల్ పరిధిలో 74.96 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అత్యధికంగా ధర్మపురి మున్సిపల్ లో 75.16 శాతం, అత్యల్పంగా మెట్ పల్లి మున్సిపల్ లో 69.21 శాతం ఓటింగ్ నమోదయింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular