Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్తెలుగు భాష గొప్పతనం

తెలుగు భాష గొప్పతనం

📰 Generate e-Paper Clip

నవగీతం, హైదరాబాద్:

తెలుగు అంటే ఒక వెలుగు

అమ్మ భాష తెలుగుభాష

కమ్మనైన భాష తెలుగు

అమ్మ నేర్పిన అమ్మ భాష తెలుగు!!

తీయనైన భాష తెలుగు భాష

అమ్మ ఒడిలోన పలికే తెలుగు భాష

తెలుగు భాష పాటల ఊట

సకల కళలకు పూదోట తెలుగు భాష!!

నలుగురు మెచ్చే నా తెలుగు భాష

బహు చక్కనైన నా తెలుగు భాష

అందరినీ ఒక్కటి చేసే నా తెలుగు భాష

ఆత్మగండ్ల భాష నా తెలుగు!!

స్వచ్ఛమైన తెలుగు భాష

అందమైన మన తెలుగు భాష

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలుగు భాష

అందమైన ప్రపంచంలో అందమైన భాష తెలుగు!!

అమృతం లాంటి అమ్మ భాష తెలుగు

ఆనందాన్ని ఇచ్చే తెలుగు భాష

ఆత్మ బంధువు లాంటి భాష తెలుగు

వెన్నెల లాంటి వెలుగునిచ్చే తెలుగు భాష

అవని లో అమ్మ భాష గొప్పది!!

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా…

రచన..దేవులపల్లి రమేశ్, కలం :వామిక శ్రీ,  నంగునూర్, సిద్దిపేట.సెల్: 9963701294.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular