డీఎన్ఆర్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ ట్రస్ట్ అందేజేస్తున్న స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని డీఎన్ఆర్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతాపరెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని పిఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు) లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినుల విద్యాభివృద్ధి, ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో “డీఎన్ఆర్ – విజయపథం ఎస్సీస్సి స్టడీ మెటీరియల్”ను బుధవారం విద్యార్థినిలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విలువైన విద్యా సామాగ్రిని అందజేసిన డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే దృఢ సంకల్పంతో ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సీనియర్ ఉపాధ్యాయులు జయశ్రీ, రజిత, అబ్దుల్ రజాక్, దేవయ్య, ఉమారాణి, కమలాకర్ రెడ్డి, రాజేందర్, ఎల్ కుమార్, సత్యనారాయణ, పిడి రాధిక, మొహమ్మద్ అబ్దుల్ రజ్జాక్, పల్లె శ్రీనివాస రెడ్డి, పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థినులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకొని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, హైదరాబాద్ వారూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆకాంక్షిoచారు.

