Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని సోమవారం మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ గా మైలారపు లింబాద్రి, వైస్ ఛైర్మన్ గా ఓంకారి నవీన్ కుమార్ గెలుపొందగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావులతో కలిసి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. నూతనంగా మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్ కుమార్లు గెలుపొందిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెట్ పల్లి మున్సిపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో ఈ సందర్భంగా వారు చర్చించారు. మెట్ పల్లిని ఆదర్శవంతమైన మున్సిపల్ గా తీర్చిదిద్దడానికి ముందుండి పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లికి చెందిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular