Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంగన్ వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్ వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కౌన్సిలర్ కలాల రాధా సాయిచంద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

అంగన్ వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ కలాల రాధా సాయిచంద్ కోరారు. కోరుట్ల పట్టణంలోని మార్కండేయ వీధి -1లో గల అంగన్‌వాడీ సెంటర్ లో బుధవారం శ్రీమంతం, అన్నప్రసన్న కార్యక్రమలను సీడీపీఓ మణిమ్మ, కౌన్సిలర్ కలాల రాధాసాయిచంద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కొత్తగా ఎనికైన కౌన్సిలర్ కలాల రాధాసాయిచంద్ ను ఘనంగా సన్మానించారు. గర్బిణీలు తీసుకునే పోషకాహారం గురించి సీడీపీఓ మణిమ్మ, సూపర్‌వైజర్ అనిత, మెడికల్ ఆఫీసర్ వివరించారు. ప్రతి నెలా 0-5 సంవత్సరాల పిల్లలు బరువులు తీయాలని, 3 నుండి 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డులోని లబ్ధిదారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular