Sunday, April 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపెద్దాపూర్ మల్లన్న స్వామిని దర్శించుకున్న మంత్రి తనయుడు

పెద్దాపూర్ మల్లన్న స్వామిని దర్శించుకున్న మంత్రి తనయుడు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో గల మల్లన్న స్వామిని బుధవారం రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనయుడు హరీశ్వర్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగత పలికారు. అనంతరం మల్లన్న స్వామికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి, రాష్ట్ర నాయకులు కాటిపెళ్లి రాధా శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ జవిడి తిరుపతి, వైస్ చైర్మన్ మెరుగు విలాస్ గౌడ్, బైరి సురేష్, మెరుగు రమేష్ గౌడ్, మాజీ చైర్మన్ మిట్టపల్లి నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ తేలుకంటి శంకరయ్య, వీడిసి చైర్మన్ మెరుగు దశ గౌడ్, ఆలయ ధర్మకర్తలు తేలుకంటి రఘు, దశ గౌడ్, బుడుత గోపి, గొర్రె రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular