Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజగిత్యాల జిల్లా నెట్ బాల్ క్రీడకు కొత్త ఊపు

జగిత్యాల జిల్లా నెట్ బాల్ క్రీడకు కొత్త ఊపు

📰 Generate e-Paper Clip

నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాకు చెందిన నెట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, నెట్ బాల్ క్రీడాభివృద్ధి, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ ఎన్నికలకు బి.వేణుగోపాల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షునిగా యం ఏ అరిఫ్, ఉపాధ్యక్షులుగా బి.తిరుపతి, భీమేశ్, ప్రధాన కార్యదర్శిగా గౌతమ్, కోశాధికారిగా సుమంత్, సంయుక్త కార్యదర్శులుగా నవీన్, మణిదీప్,

ఈసీ మెంబర్లుగా తేజ, సంధ్య, అక్షయ్,యశ్వంత్ ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో నెట్ బాల్ క్రీడను మరింత అభివృద్ధి పరచడానికి కృషి చేసి యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను పి వేణుగోపాల్, బి రాజశేఖర్ సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular