Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణఖమ్మంజింకల గూడెం అభివృద్ధి నా ధ్యేయం

జింకల గూడెం అభివృద్ధి నా ధ్యేయం

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది

ఎమ్మెల్యే రాందాస్ నాయక్

నవగీతం, వైరా :

వైరా మండలం తాటిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని జింకలగూడెంలో శనివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గ్రామ సర్పంచ్ జవ్వాజి అశ్విని నాగరాజు తో కలిసి రెండు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అని అన్నారు, జింకల గూడెం అభివృద్ధి నా ద్వేయం, ఇచ్చిన మాట ప్రకారం గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.

గ్రామంలో ఒక్క రేకుల ఇల్లు లేకుండా ఇందిరమ్మ ఇల్లును నిర్మిస్తాం మీ గ్రామ సర్పంచ్ విద్యావంతురాలు యువకురాలు నిత్యం మీకు అండగా ఉంటుంది సమస్యను తెలుసుకుంటే ఆ క్షణం అక్కడే వాలుతుంది ,సమస్య పరిష్కారం చేస్తుంది అని తెలిపారు ,గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాను.సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీలు ఏర్పాటు ఆపద ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటాను ,మీ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు పని చేసి తీరుతామని ఆయన అన్నారు. ఏ సమస్య ఉన్న సర్పంచ్ జవ్వాజి అశ్విని కీ చెప్పండి నేను పూర్తి సహకారం అందిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, ఎంపీడీవో సక్రియ్య ,తాసిల్దార్ సురేష్ బాబు ఎం పి ఓ రాజేశ్వరి , మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్,సర్పంచులు మేడూరు రామారావు ,ఆళ్ల వెంకట్రావు, ఉప సర్పంచ్ షేక్ ఇస్మాయిల్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట నర్సిరెడ్డి, జవ్వాజి కృష్ణయ్య,జయరాజు, తాతా నిర్మల, దాసరి దానియేలు, వీడికి రత్నం,దొడ్డ పుల్లయ్య , జవ్వాజి నాగరాజు,వీరంశెట్టి సీతారాములు, పమ్మి అశోక్ ,పల్లపు కొండలు, జవ్వాజి వెంకటేశ్వరరావు, దుగ్గిరాల శ్రీనివాసరావు, బండి కోటయ్య , షేక్ ఉమ్మర్ , షేక్ అల్లా చిత్తరు కృష్ణ షేక్ మీరా పాపగంటి వెంకటేశ్వర్లు   అంగన్వాడి టీచర్లు,ఫీల్డ్ అసిస్టెంటెంట్, ఆశ వర్కర్లు, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular