Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపొన్నం ఎన్నికపై ఉమా మహేష్ హర్షం

పొన్నం ఎన్నికపై ఉమా మహేష్ హర్షం

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

తెలంగాణ బార్ కాన్సిల్ ఎన్నికలో విజయం సాధించిన సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కు బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ ఎన్నిక చారిత్రక విజయం అని అన్నారు. బార్ కాన్సిల్ లో అవినీతి, అక్రమాలకు అడ్డగా మారిందనే విమర్శల నేపథ్యంలో సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ గారి ఎన్నికతో బార్ కాన్సిల్ ప్రక్షాళన తథ్యం అని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న పొన్నం అభిమానులకు ముందస్తు “ఉగాది వేడుకల” ఉందని సంతోషం వ్యక్తం చేశారు, యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై చొరవ చూపుతారని పేర్కొన్నారు. కాబోయే తెలంగాణ బార్ కాన్సిల్ చైర్మన్ పదవి కూడా సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కే వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular