నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మహాప్రస్థానం హైదరాబాద్ తరహాలో జగిత్యాల పట్టణంలోని శ్రీ సత్య హరిచంద్ర స్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటికలో రోటరీ, ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఆపి రూటరీ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం అని కొనియాడారు.

పుట్టిన వారు గిట్టక తప్పదు చనిపోయిన తర్వాత వారి ఆత్మ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. ఆపి రోటరీ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అరవ లక్షీ, పద్మ సింగరావు, రాగుల ప్రదీప్, పిట్ట ధర్మరాజు, బొలుసాని శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, బోడ్ల జగదీశ్, వేణుగోపాల్, నాయకులు సుధాకర్ రావు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ సిబ్బంది, ఎన్ సి సి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

