నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా శనివారం నర్సరీ లో మొక్కల పెంపకం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు పాటుపడాలని, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ఎం.డీ షబ్బీర్,అరికుప్పల రాజం, భుక్యా శేఖర్, కదుర్క లక్ష్మి, ఏనుగంటి నరేష్, శనిగారపు నరేష్ అంగన్వాడీ ఇందిర,విద్యుత్తు సిబ్బంది సోమేశ్, రామ నవీన్, ఏ.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు.

