Wednesday, April 29, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవిజయవంతంగా ఉచిత వైద్య శిబిరం

విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మల్లాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్య అధికారి వాహిని మాట్లాడుతూ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, డాక్టర్ దీప్తి  వైద్య శిబిరాన్ని సందర్శించారని అలాగే నిపుణులైన వైద్యులచే 303 మంది ని పరీక్షించి మందులు పంపిణీ చేసామని 129 మందిని హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వైద్యాధికారిణి వాహిణి, ఆరోగ్యాధికారి రాం మోహన్, ల్యాబ్ టెక్నీషియన్ దాసరి ఉమా దేవి,కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ముత్యాల గంగారాజం ,భుక్యా శేఖర్, అల్లె చంద్రయ్య, ఏ.వి.ఆర్, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular