జిల్లా అధ్యక్షులుగా టాంక్ జై దేవ్-లడ్డు
నవగీతం, పెద్దపల్లి:
తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు పసిలేటి సదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నూతన కమిటీని ప్రకటించారు.

గౌరవ జిల్లా అధ్యక్షులుగా బొడ్డుపల్లి రామ్మూర్తి,జిల్లా అధ్యక్షులుగా టాంక్ జై దేవ్-లడ్డు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోలి తిరుపతి, ఉపాధ్యక్షులుగా అడప మహేష్, వెన్నంపల్లి మల్లన్న,ప్రధాన కార్యదర్శిగా కంది సంపత్, కోశాధికారిగా పసిలేటి సదన్న,సంయుక్త కార్యదర్శులుగా ఆకుదారి వెంకటేష్,సలేంద్ర రాజయ్య,ప్రేమ్ సాగర్,గౌరవ సలహాదారుగా ఈర్ల రామన్న, ప్రచార కార్యదర్శిగా వడ్నాల తిరుపతి, మరియు కమిటీ సభ్యులుగా రంగు నాగ నిఖిల్,ముత్యాల తిరుపతి,గుర్రాల సంతోష్ నియామకమయ్యారు.అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి సాగర్ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మంజులతో పాటు మహిళా ఉపాధ్యాయులతో కేక్ కట్ చేయించి,శాలువాలతో వారిని సన్మానించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లాలోని యూట్యూబర్ల సంక్షేమం కోసం,సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు

