Sunday, April 26, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లిఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

జేఏసీ చైర్మన్ మల్ల కిషన్ రెడ్డి పిలుపు

నవగీతం, పెద్దపల్లి :

తెలంగాణ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ మింట్ కాంపౌండ్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహాధర్నాలో ఆర్టిజన్ కార్మికులు,స్పాట్ బిల్లర్లు,మరియు ఆన్ మాన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పెద్దపల్లి జేఏసీ చైర్మన్ మల్ల కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులుగా సేవలందిస్తున్నప్పటికీ,ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్ నిబంధనలు ఉండటం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీఎస్ రూల్స్ మరియు కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని,అలాగే మిగిలిన పీస్‌రేట్ మరియు ఆన్ మాన్ కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆర్టిజన్ కార్మికులందరూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular