నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో సార్గమ్మ, నీర్గమ్మ దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గతంలో కర్రతో తయారు చేసిన ఈ దేవతల ప్రతిమలు కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కొత్తగా శిలావిగ్రహాలను తయారు చేయించారు. అనంతరం చెప్యాల గ్రామానికి చెందిన బైండ్ల పూజారుల చేతుల మీదుగా పునఃప్రతిష్ట నిర్వహించారు.ఈ సందర్భంగా విగ్రహాలను పూర్వపు ఆంజనేయస్వామి ఆలయం. కుమ్మరి సంఘం పెద్దమనిషి ఇంటి వద్ద నుంచి ప్రధాన బోనంతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్టించారు.కార్యక్రమాన్ని గ్రామస్థులు ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ పనివారు, రావెప్ విద్యార్థులు, గ్రామ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

