నవగీతం, వైరా ప్రతినిధి:
స్థానిక విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఎండలు బాగా వస్తున్నందున పిల్లలందరూ ఇంట్లోనే ఉండాలని తెలిపారు. చెరువుల వెంబడి ఈతకు వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండానే ఉండాలని కోరారు. వేసవి కాలంలో, ఏదో ఒక విషయంలో శిక్షణ పొంది, వేసవి కాల సెలవలను ఆనందంగా గడపాలన్నారు. చెరువుల వద్ద వాగుల వద్ద ఈతకని వెళ్లి, ఇబ్బందుల పాలు కావద్దన్నారు. చిన్న పిల్లల కథలు తదితర నేర్చుకొని వేసవి కాల సెలవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలతో ఉంటారని వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.

