Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలక్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

📰 Generate e-Paper Clip

హైకోర్టు అడ్వకేట్ రాపల్లి శివకుమార్

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని హైకోర్టు అడ్వకేట్ రాపల్లి శివకుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే లు కొమిరెడ్డి రాములు కొమిరెడ్డి జ్యోతి దేవిల జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ఆదివారం ఫైనల్ జరగగా గెలుపొందిన టీంకు ప్రైజ్ మనీ మరియు విన్నర్ ఆఫ్ కప్పును హైకోర్టు అడ్వకేట్ రాపల్లి శివకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చెడు బానిసలకు లోను కాకుండా చదువుతోపాటు క్రీడలు కూడా అలవాటు పరుచుకొని శరీరక దృఢత్వానికి తోడ్పడును అందించుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాపల్లి మహేష్, మాజీ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్, విడిసి అధ్యక్షులు పుప్పాల గజేందర్, వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular