Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ సురేష్ బాబు

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ సురేష్ బాబు

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని సోమవారం సర్కిల్ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెట్ పల్లి సీఐ సురేష్ బాబు అధ్యక్షత వహించారు. పండుగ సమయంలో శాంతి భద్రతలు కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలు, రవాణా నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే అపోహలు, వదంతులను అరికట్టడం వంటి అంశాలపై సీఐ వివరించారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను ప్రశాంతంగా, సఖ్యతతో జరుపుకోవాలని అధికారులు, ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular