జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం మండల పరిధిలోని గోదూరు, తిమ్మాపూర్ తాండ, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ధాన్యం తూకం, నిల్వ రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గన్ని సంచులు, టార్ఫలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని పాడీని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు.ఈ పరిశీలనలో మెట్ పెల్లి ఆర్డీవో నరసింహ రావు, మండల తహసిల్దార్ వరప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


