Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసెన్సస్ 2027బ్యాచ్–1 , 2 శిక్షణ విజయవంతంగా ముగింపు

సెన్సస్ 2027బ్యాచ్–1 , 2 శిక్షణ విజయవంతంగా ముగింపు

📰 Generate e-Paper Clip

నవ గీతం ,కొడిమ్యల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం పూడూర్ జెడ్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లకు నిర్వహించిన బ్యాచ్–1, బ్యాచ్–2 శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.ఈ రెండు బ్యాచ్‌లలో కలిపి మొత్తం 77 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు శిక్షణ పొందారు. శిక్షణలో సెన్సస్ ప్రక్రియ, డిజిటల్ ఎన్యూమరేషన్ విధానం,మొబైల్ అప్లికేషన్ వినియోగం, డేటా సేకరణలో పాటించాల్సిన నిబంధనలు వంటి అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. మూడవ రోజు భాగంగా ఎన్యూమరేటర్లు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ పొందారు. ప్రజలను ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగే విధానం, సమాచారం సేకరణలో పాటించాల్సిన పద్ధతులపై వారికి మార్గదర్శకాలు అందించారు. జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి శిక్షణ శిబిరాన్ని సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు.గణకులు, సూపర్వైజర్లు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఖచ్చితమైన డేటా సేకరణతో సెన్సస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.తహసీల్దార్ (చార్జ్ అధికారి) మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి గణకుడు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.శిక్షణలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఉత్సాహంగా పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular