చిరు వ్యాపారులు రేపు నిరసనలకు రావాలని పిలుపు
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
చారిత్రాత్మక గడి బురుజులు, కోనేరు, వాటి స్థలాలు కాపాడుకుందామని గడి మైసమ్మ కు పూజలు చేసిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు అనంతరం చిరు వ్యాపారులను రేపటి నిరసనలకు రావాల్సిందిగా మార్కేట్ కు వెళ్లి పిలుపునిచ్చిన నాయకులు. శుక్రవారం గడి బురుజులో వున్న మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు అనంతరం చిరు వ్యాపారులను కలిసి నిరసన దీక్షలకు ఆహ్వానించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర శేఖర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ ..అనేక సంవత్సరాలుగా ప్రజల అండతో గడి బురుజులు, కోనేరు వాటి స్థలాల రక్షణ కోసం ఉద్యమిస్తున్నామని అందువల్లే ఇన్ని రోజులు వాటి పై దృష్టి పెట్టెందుకు భయపడ్డారని కానీ ఈమధ్య కొందరు బడా నాయకులు రియల్టర్లతో కుమ్మక్కై కోరుట్ల ప్రజలను మోసం చేసేందుకు నకిలీ దస్తావేజులతో కమీషనర్ ను పావుగా వాడుకొని అక్రమ విఎల్టీలు ఏపించారని ఇందులో అందరూ కలిసి తోడు దొంగల్లా ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా గడి స్థలాల విఎల్టీలను రద్దు చేయాలని భవిష్యత్తు తరాలకు చారిత్రక నేపథ్యం ఉన్న బురుజుల సంపదను కాపాడుకుందాం అని దానికి తాను ముందుండి ఉద్యమిస్తానని, పట్టణ యువత పాత్రికేయులు వివిధ పార్టీల నాయకులకు చేతులు జోడించి వేడుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు ప్రజల పక్షాన అఖిలపక్ష ప్రజాసంఘాల కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే బిఆర్ఎస్, బిజేపి కౌన్సిలర్లు గడి స్థలాల విఎల్టీల రద్దుకై సిద్ధంగా ఉన్నారని అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సహకరిస్తే కోరుట్ల ప్రజలు రుణపడి ఉంటారని గడి స్థలాలలో మార్కేట్, పార్కు, మైసమ్మ దేవాలయం, కోనేరు అభివృద్ధి చేసేంతవరకు శాంతి యుత పోరాటాలు కోనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, ఎం డి ముజాహిద్, చింత భూమేశ్వర్, సాహెద్ మహ్మద్ షేక్, రాంబాబు, రమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


