Sunday, August 2, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జువ్వాడి నర్సింగ్ రావు కి ఘన సన్మానం

ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జువ్వాడి నర్సింగ్ రావు కి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్:ఆగష్టు2,(నవగీతం):తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన జువ్వాడి నర్సింగ్ రావు ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, వెలమ సమాజ అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్‌కు తొలి చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావు నియమితులు కావడం సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో వెలమ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలై, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం జువ్వాడి నర్సింగ్ రావు ని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వెలమ సంఘ ప్రతినిధులు, ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular