నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
వాసవి క్లబ్ గ్రేటర్ మెట్ పల్లి ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత జయంతిని పురస్కరించుకొని పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు ఓ ఆర్ ఎస్ ద్రావణము బ్రెడ్డు ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ మరియు కౌన్సిలర్లు పాల్గొని రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కొండూరి రాజేష్ కార్యదర్శి గుండా శివ కోశాధికారి కోటగిరి సంతోష్ వాసవి క్లబ్ గ్రేటర్ మెట్ పల్లి మాజీ అధ్యక్షులు కోట కిరణ్ కుమార్ తదితరులు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు.


