నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
బిఆర్ఎస్ పార్టీ దినోత్సవం సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పార్టీని స్థాపించి అన్ని వర్గాలను ఏకం చేసి , అలుపెరుగని పోరాటం చేసి,ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని,ఇప్పటికి ఎప్పటికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రే రక్ష అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్ట సురేందర్, వసీం,మోసిన్, కొక్కెర వెంకటేష్, నాయకులు మోహన్ రెడ్డి, ఫహీం, అన్వర్,సజ్జు,ఎలుగురి కిరణ్,జాల వినోద్,గెల్లె శ్రీనివాస్,గెల్లె గంగాధర్, మిట్టపెళ్లి శేఖర్,జంగిలి విజయ్, యటం కృష్ణ, దశరథం,బింగి సంతోష్, అడేపు నరేష్,గరిగే రాజశేఖర్, వంకర్ రాజ్ కుమార్, ఇమ్రాన్,రహీం పాషా,బతిని అంజయ్య,ఒడ్నల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

