Tuesday, April 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన హిందూ బంధువులు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి

భారతదేశంలోని జాతీయస్థాయిలో జరుగుతున్న గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ లో భాగంగా యావత్ భారత దేశంలో ప్రతి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో హిందూ బంధువులు అందరూ కూడా సాదుసంతువుల తో కలిసి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గో రక్షణ చేపట్టాలని ప్రధానమంత్రి కి మరియు రాష్ట్రపతి కి గవర్నర్ ముఖ్యమంత్రి కి ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది.ఇందులో భాగంగా సోమవారం కోరుట్ల పట్టణంలో ని ఎమ్మార్వో ఆఫీస్ లో హిందూ బంధువులు సనాతన ధర్మ ప్రచారకులు అందరూ కూడా కలిసి ఎమ్మార్వోకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోరుపాక రమేష్, కళాల సాయి చందు, బి ఆర్ ఎస్ నాయకులు టేకుల నరేష్ , హిందూ బంధువులు కొండబత్తిని అమర్ నాథ్, వడ్లకొండ శ్రీనివాస్,గట్ల ప్రకాశ్,యాంసాని ప్రసాద్, కంఠం శ్రీనివాస్, బర్కాం సతీష్ ,కునారపు గణేష్,గోనె వినయ్, కోటగిరి సంపత్, బొమ్మెన ప్రదీప్, గండ్ర మహీదర్, చింతకింది రాజు, జగదీష్, క్యాతం మహేష్, నాంపల్లి ప్రసాద్, అనిల్, పేట అభినవ్ తదితరులు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular