Wednesday, April 29, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనైపుణ్య శిక్షణ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు

నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు

📰 Generate e-Paper Clip

గల్ఫ్ ఏజెంట్ల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నవగీతం, జగిత్యాల/ ధర్మపురి:

రాష్ట్రంలో యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ తో కలిసి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.గత పాలకులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుష్కరాలను ధర్మపురి క్షేత్రం నుంచి ప్రారంభించినప్పటికీ ధర్మపురి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మంత్రి ఆరోపించారు. గతంలో పుష్కరాల సమయంలో పనులు చేయడం వల్ల నాణ్యత లేకపోవడం, భక్తులు పుష్కరాలకు వస్తున్న సమయంలో పనులు చేయడంతో పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారని మంత్రి తెలిపారు. ఈసారి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని మంత్రి అడ్లూరి తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో శిక్షణ పొందిన యువతకు స్థానికంగా ఉపాధి లభించడంతో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం టాంకాం దార యువతీ యువకులకు విదేశీ భాష పై అవగాహన కల్పించి గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చిన సందర్భంగా మంత్రి వివేక్ గారికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏటీసీల్లో అగ్రికల్చర్ కోర్స్..మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో అగ్రికల్చర్ కోర్సును నూతనంగా ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున ఏటీసీల్లో అగ్రికల్చర్ కోర్స్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషకరమని మంత్రి తెలిపారు. టామ్ కామ్ ద్వారా జగిత్యాల జిల్లా నుండి 30 మందికి శిక్షణ ఇవ్వడానికి అభ్యర్థులను ఎంపిక చేయాలని మంత్రి వివేక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular