శాస్త్రవేత్తలతో వివిధ పంటల సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్న రైతులు
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస శాస్త్రవేత్తలు బుధవారం మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ క్లస్టర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, వేంపల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా శాస్త్రవేత్త డా. మధు బిందు మాత్లాడుతూ రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులు వారి సందేహాలను నివ్రుత్తి చేసుకోడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కల్పించిన ఒక మంచి అవకాశం అని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా యూరియా , రసాయినాల వినియోగం తగ్గించుకుంటూ, సరైన పంట మార్పిడి, నీటి యాజమాన్యం, సేంద్రియ సాగు పద్ధతులను అవలంబించాలని కోరారు. జిల్లాలో రైతులు అధికంగా వరిని సాగు చేస్తున్నారు కాబట్టి వారు పంటకు ముందు పచ్చి రొట్ట ఎరువులు వేస్కొని, యూరియాని సిఫార్సు ప్రకారం తక్కువ మోతాదుల్లో ఎక్కువ దఫాల్లో వేస్కుంటూ, ఆరుతడి పద్ధతిలో నీరు పెడుతూ, కాలి బాటలు ఏర్పాటు మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటిస్తే, పంట ఖర్చు తక్కువై, నేల సారవంతతపై ప్రభావం పడదు అని తెలిపారు. మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో మార్కెటింగ్ మరియు ఎంఎస్పి అంశాల గురించి కూడా కొంత అవగాహన ఏర్పరిస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు. వేంపల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ క్రాప్ క్యాలెండర్ ప్రతి పంటకి క్రాప్ క్యాలెండర్ వారి మార్కెటింగ్ సదుపాయాల గూర్చి అవగాహన కల్పిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ రైతులు అధికారులు, శాస్త్రవేత్తలతో పంటలకు సంబంధించిన వివిధ సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు .ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి మాట్లాడి వాటి యొక్క పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చరల్ అధికారి, శ్రీనివాస్ రైతులకు ఆయిల్ పాం సాగుకు కావలసిన వివిధ ఇన్ పుట్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గూర్చి రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణా అధికారులు గజానంద్, వంశీ, వినీత సంధ్య, విద్యార్ధులు కావ్యశ్రీ, రచన అనికేత్ ఉప సర్పంచ్ సోమరెడ్డి, పూండ్ర లక్ష్మా రెడ్డి,కళ్లెం మహిపాల్ రెడ్డి, కొప్పెల కృష్ణా రెడ్డి, అనిల్ రెడ్డి,వార్డు సభ్యులు షబ్బీర్, ముత్యాల గంగా రాజం, ముష్కరి రమేష్,క్యాతం మల్లారెడ్డి, కొప్పెల శేఖర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


