Thursday, April 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపేదరికంలో మెరిసిన ఆణిముత్యాలు

పేదరికంలో మెరిసిన ఆణిముత్యాలు

📰 Generate e-Paper Clip

విద్యార్థుల ఘనతపట్టుదల ఉంటే విజయం సాధ్యమేనని నిరూపణ

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన గుండేటి అనుదీప్ పదవ తరగతిలో 567 మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానం పొందాడు. అదే గ్రామానికి చెందిన సలేంద్ర రేవతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తాటిపల్లి గురుకుల పాఠశాలలో చదివి 479 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది.ఈ సందర్భంగా మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు గ్రామంలో విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు. వారి కుటుంబాలు పేదవని,తల్లిదండ్రులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినప్పటికీ పిల్లలు పట్టుదలతో ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు. ఉన్నత విద్యను అభ్యసించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular