Thursday, June 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, పారిశుధ్య కార్మికులకు సన్మానం

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, పారిశుధ్య కార్మికులకు సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో  పదవ తరగతి టాపర్స్ అయినటువంటి సెవ్వ రిశ్వంత్ (570),బొక్కల చరణ్య (568),చిట్ల రాఘవి (564) లను పలువురు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి మాట్లాడుతూ చదువు ను ఇష్టం తో చదివి భవిష్యత్ లో మంచి ఉద్యోగం లు సంపాదించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మే డే సందర్బంగా పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పూండ్ర లక్ష్మా రెడ్డి,వార్డు సభ్యులు మహమ్మద్ షబ్బీర్,ఎనుగంటి నరేష్,మాజీ ఎంపీటీసీ మరిపెల్లి మల్లయ్య, సిరిపురం రవీందర్, కోటగిరి ఆనంద్ గౌడ్,మాట్ల సోమయ్య గొట్టిపడుత రమేష్ గౌడ్,ఊరెడి రవి,శంబు చిన్న అంజన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular