Saturday, May 2, 2026
ads
Homeతెలంగాణఖమ్మంధాన్యం కొనుగోలు లో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకపోవడం వల్ల రైతులకు ఇక్కట్లు

ధాన్యం కొనుగోలు లో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకపోవడం వల్ల రైతులకు ఇక్కట్లు

📰 Generate e-Paper Clip

సమీక్షా సమావేశాలు, రివ్యూ లకే మంత్రులు పరిమితం

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

నవగీతం: వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా లో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి లపై మంత్రుల సృందన సక్రమంగా లేదు అని, సమీక్షా సమావేశాలు రివ్యూ లకే మంత్రులు పరిమితం కాకుండా కొనుగోలు కేంద్రాల్లో రైతులు సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శనివారం అష్ణగుర్తి , వల్లా పురం గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం, సిఐటియు సంయుక్త గా కార్మిక, కర్షక ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు బాజోజ్ రమణ, రైతు సంఘం జిల్లా నాయకులు బాణాల శ్రీనివాసరావు మాట్లాడారు. అమెరికా ,భారత ట్రేడ్ డీల్ రైతులకు మరణశాసనం అవుతుంది అని అమెరికా నుంచి దిగుమతి సుంకాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు మనదేశంలో కి అనుమతి ఇవ్వడం ద్వారా రైతులను దెబ్బతీసుందున్నారని అన్నారు.అమెరికా ఒత్తిడి వల్ల వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేయకుండా రైతులను నిరుత్సాహ పరిచే కుట్ర లో భాగంగా రబీ సీజన్లో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది అని అన్నారు, ఆంక్షలు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కు అవసరమైన ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకపోవడం వల్లగన్ని సంచులు లారీలు అవసరమైన మేరకు సరఫరా లేక, గోదాములు దగ్గర దిగుమతి సకాలంలో పూర్తి కాక రైతుల పై అదనపు భారం పడుతుందని అన్నారు. మంత్రులు, అధికారుల చేతుల్లో లేకుండా పోయింది అని అన్నారు.ధాన్యం కొనుగోలు కూడా నామమాత్రంగా జరుగుతుంది అని మిల్లర్లు క్వింటాళ్ల ధాన్యం కు ఐదు నుంచి పది కేజీల తరుగు తీసి వేయిటకు అంగీకరించిన రైతులు దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అని ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా ఉన్నాయి అని అన్నారు. యుద్ధప్రాతిపదికన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు పూర్తి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అష్ణగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింత నిప్పు చలపతిరావు, సోసైటీ వైస్ చైర్మన్ కోణితెన కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు చిత్తారు నాగరాజు, ఎస్ కె మజీద్, నారాయణ గుత్తా పద్మా, నవీన్,లక్షణ్, మురళి, ప్రవీణ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular