Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరైతులను సన్మానించిన మార్కెట్ పాలకవర్గం

రైతులను సన్మానించిన మార్కెట్ పాలకవర్గం

📰 Generate e-Paper Clip

నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారము కార్యక్రమములో భాగముగా వ్యవసాయ మార్కెట్ కమిటి, ఇబ్రహీంపట్నం నందు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయం మార్కెటింగ్ శాఖ తరుపున చేస్తున్న కార్యక్రమాలు రైతు బంధు, రైతు భీమా కొనుగోలు కేంద్రాలకు పరికరాల పంపిణీ గురించి క్లుప్తముగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకట్ రెడ్డి వివరించారు. అనంతరం రైతులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాల మూడు నెలలు కావస్తున్న సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి తో పాటు మార్కెట్ కమిటీ కార్యదర్శి నీరటి సురేందర్, పాలకవర్గ సభ్యులు.భూస రాజేశ్వర్, రాగుల గణేష్, దామెర శ్రీనివాస్, గుమ్మల రమేష్ , రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular