Thursday, September 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలయామాపూర్‌లో నిరుపేద కుటుంబానికి అండగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్..

యామాపూర్‌లో నిరుపేద కుటుంబానికి అండగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్..

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గుడిసె ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న సామగ్రి మొత్తం దగ్ధమై కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ ఘటనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు, పిల్లలకు బట్టలు అందజేశారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావాలని, ఇందుకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని పుల్ల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో యామాపూర్ సర్పంచ్ కనక నాగేష్, మాజీ సర్పంచ్ తలారి ఆనంద్, కాస ప్రశాంత్, విగ్నేష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular