Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి

రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి

📰 Generate e-Paper Clip

సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలి

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధనా పొలాస శాస్త్రవేత్తలు సోమవారం మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట  క్లస్టర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, రత్నపూర్ గ్రామ సర్పంచ్ గుండ రాజేందర్ , మొగిలిపేట ఉపసర్పంచ్ దండవేని రాజేందర్  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ముందుగా శాస్త్రవేత్త డా. రాకేష్  మాట్లాడుతూ… రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం రైతులు వారి సందేహాలను నివ్రుత్తి చేసుకోడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కల్పించిన ఒక మంచి అవకాశం అని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా యూరియా మరియు రసాయినాల వినియోగం తగ్గించుకుంటూ, సరైన పంట మార్పిడి, నీటి యాజమాన్యం, మరియు సేంద్రియ సాగు పద్ధతులను అవలంబించాలని కోరారు. జిల్లాలో రైతులు అధికంగా వరిని సాగు చేస్తున్నారు కాబట్టి వారు పంటకు ముందు పచ్చి రొట్ట ఎరువులు వేస్కొని, యూరియాని సిఫార్సు ప్రకారం తక్కువ మోతాదుల్లో ఎక్కువ దఫాల్లో వేస్కుంటూ, ఆరుతడి పద్ధతిలో నీరు పెడుతూ, కాలి బాటలు ఏర్పాటు మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటిస్తే, పంట ఖర్చు తక్కువై, నేల సారవంతతపై ప్రభావం పడదు అని తెలిపారు. మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ  రమేష్ మొగిలిపేట ఉపసర్పంచ్ దండవేని రాజేందర్  మాట్లాడుతూ.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో మార్కెటింగ్ మరియు ఎంఎస్పి అంశాల గురించి కూడా కొంత అవగాహన ఏర్పరిస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ రైతులు అధికారులు మరియు శాస్త్రవేత్తలతో పంటలకు సంబంధించిన వివిధ సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు మరియు ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి మాట్లాడి వాటి యొక్క పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణా అధికారిన వినీత విద్యార్ధులు అరుణ్, అనికేత్ మరియు రైతులు ఏలేటి జలపతి రెడ్డి , ముద్దం రాజేందర్ రెడ్డి, వర్ధ సురేశ్, రాజారెడ్డి, రమేష్, జీవన్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular