Tuesday, August 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహమాలీల ఆరోగ్య రక్షణకు జగిత్యాల పాక్స్ ముందడుగు.

హమాలీల ఆరోగ్య రక్షణకు జగిత్యాల పాక్స్ ముందడుగు.

📰 Generate e-Paper Clip

వరిధాన్య కొనుగోలు కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ల పంపిణీ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ (పాక్స్ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్య కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హమాలీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు సేవలు అందిస్తున్న హమాలీల శ్రమ అమూల్యమని, వారి ఆరోగ్య భద్రతకు సంఘం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. వేసవి కాలంలో శరీరానికి నీరసం రాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ఉపయోగపడుతుందని,అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉపయోగకరమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఆగునూరి గంగరాజం, వార్డు మెంబర్ సంకోజి శారద-చంద్రశేఖర్,ఏం ఎల్ హెచ్ పి డాక్టర్ అనూష,రైతు సోదరులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular