నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
వడ్డెర కమ్యూనిటీ పైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వడ్డెర సంఘం మల్లాపూర్ మండల అధ్యక్షులు అల్లెపు నరేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లెపు నరేష్ మాట్లాడుతూ.. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని గుర్తించడంతో వడ్డెర సమాజానికి గౌరవం దక్కిందని అలాగే అనేక కష్టాలు ఎదుర్కొంటున్న మాకు రూ.2000 కోట్లు బడ్జెట్ కేటాయించి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించి సమాజ అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే వడ్డెర కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ గా నియమితులైన గుంజే రేణుక నారాయణ కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అలాగే తెలంగాణ ప్రభుత్వనికి ధన్యవాదములు తెలిపారు.

