Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపెన్షన్ దారులు లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి: కౌన్సిలర్ పొట్ట సురేందర్

పెన్షన్ దారులు లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి: కౌన్సిలర్ పొట్ట సురేందర్

📰 Generate e-Paper Clip

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :

స్థానిక 16వ వార్డు పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ ముఖ్యమైన సూచన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు పొందుతున్న ప్రతి ఒక్కరికీ సోమవారం నుండి ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. కావున పెన్షన్ దారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తప్పనిసరిగా తమ అథెంటికేషన్ పూర్తి చేయించుకోవాలని కోరారు. లబ్ధిదారుల సౌకర్యార్థం మన వార్డులోని రథాలపంపు వద్ద గల అంగన్వాడీ సెంటర్ నందు వార్డు అధికారి అందుబాటులో ఉంటారని, పెన్షన్ దారులు అక్కడికి వెళ్లి తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ఎల్లప్పుడూ వార్డు ప్రజల సేవలో ఉండేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా కౌన్సిలర్ సురేందర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular