Wednesday, September 23, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

📰 Generate e-Paper Clip

ఈ నెల 27న రాయికల్ శ్రీ చెన్నకేశవనాథ  (త్రికూటాలయం)లో వేడుకలు

“డిజిటల్ అజెండా మరియు కృత్రిమ మేధస్సుతో పర్యాటక రంగం పునర్‌రూపకల్పన” ఈ ఏడాది థీమ్

జగిత్యాల/రాయికల్, సెప్టెంబర్23,(నవగీతం):

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న జగిత్యాల జిల్లాలోని రాయికల్ గ్రామం, మండలంలోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం (త్రికూటాలయం)లో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం ప్రాధాన్యత, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడి, సుస్థిర అభివృద్ధిలో పర్యాటక రంగం పోషించే కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

2026 సంవత్సరానికి “డిజిటల్ అజెండా మరియు కృత్రిమ మేధస్సుతో పర్యాటక రంగం పునర్‌రూపకల్పన” అనే థీమ్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవ నిర్వహణపై ఈ నెల 9న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తాను పాల్గొన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాయికల్‌లోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం (త్రికూటాలయం)లో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular