నవగీతం,హైదరాబాద్:
ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు హైదరాబాదులో ఆహ్వాన పత్రికను అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరారు.

