Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్ల16వ వార్డులో లబ్ధిదారుల ఇళ్ల వద్దే ‘చేయూత’ లైవ్ ఆథెంటికేషన్

కోరుట్ల16వ వార్డులో లబ్ధిదారుల ఇళ్ల వద్దే ‘చేయూత’ లైవ్ ఆథెంటికేషన్

📰 Generate e-Paper Clip

నవగీతం , కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని 16వ వార్డులో చేయూత లబ్ధిదారుల కోసం లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియను కౌన్సిలర్ పొట్ట సురేందర్ మంగళవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అధికారులతో కలిసి నేరుగా వెళ్లి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా నేరుగా ప్రజల వద్దకే వచ్చి లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేస్తున్నామని పేర్కొంటూ, వార్డులోని చేయూత లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధ్రువీకరణను వేగంగా పూర్తి చేసుకోవాలని సురేందర్ కోరారు.ఈ కార్యక్రమంలో మహేష్, ప్రేమ్, రాజన్న, సాజిద్, మజీద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular