Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలతరుగు -తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలి: గోపిడి శ్రీనివాస్ రెడ్డి

తరుగు -తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలి: గోపిడి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, ‘తరుగు- తేమ’ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని యుద్దప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలని బిజెపి మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వాకిటి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కిరి రాజ్ కుమార్, భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular