Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల“విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం వద్దు.. - కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలి”

“విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం వద్దు.. – కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలి”

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వం నిధుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు

చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్డును వెంటనే విస్తరించాలి

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

“విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం వద్దు.. – కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలి”… జగిత్యాల ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి… కేంద్ర ప్రభుత్వం నిధుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు.. వీటిపై విచారణకు ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమా..?? అని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కోరారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితో జిల్లాకు నవోదయ విద్యాలయం రెండో విద్యా సంవత్సరంలో విజయవంతంగా కొనసాగుతోందని, ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందన్నారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కనీసం 5 ఎకరాల స్థలం అవసరమని, చల్‌గల్ ప్రాంతంలోని స్థలమే అందుకు అనువైనదని పేర్కొన్నారు. “2 ఎకరాల స్థలం ఉంటే రిజెక్ట్ అవుతుందని తెలిసినా ఎందుకు కేటాయించారు? వెంటనే 5 ఎకరాల స్థలం కేటాయిస్తే అద్దె భవనంలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుంది” అని అన్నారు. వాలంటరీ బోర్డు సభ్యురాలు అనితతో పాటు కలెక్టర్ గారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కావాలనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కేంద్రీయ విద్యాలయం కోసం కేవలం రెండెకరాలు మాత్రమే మంజూరు చేయించుకొని వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులకు అణువుగా లేని వేరే ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంత అనుకూలంగా ఉండదని, విద్యార్థులు, విద్యార్థుల తరలిదండ్రులు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఇబ్బందులను పక్కనపెట్టి తన స్వార్థం కోసం ఎమ్మెల్యే సంజయ్ అక్కడే స్థలం కేటాయించాలని పట్టు పట్టడం సరికాదన్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కనీసం 20 ఎకరాల భూమి అవసరమని, విద్యార్థుల అంశంలో ఎమ్మెల్యే సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. “పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయాలు పక్కన పెట్టాలి” అన్నారు. కేవలం తనకు రావలసిన బిల్లుల కోసమే పార్టీ మారారని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కాదని తమకు, నియోజక వర్గ ప్రజలకు తెలుసు అన్నారు.ఇక జగిత్యాల మున్సిపాలిటీలో కేంద్రం నుంచి వచ్చిన రూ.62 కోట్ల నిధుల పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పటికే పూర్తయిన సీసీ రోడ్ల పనులకే మళ్లీ టెండర్లు పిలుస్తున్నారని, 1 నుంచి 48 వార్డుల వరకు జరిగిన పనుల్లో స్కాం జరిగిందని పేర్కొన్నారు. “జగిత్యాల మున్సిపాలిటీలో రూ.60 కోట్ల పనుల స్కాం‌ను బయటపెడతాం. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు. చెట్ల పేరుతో డివైడర్లను మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చెట్ల పనులు, డివైడర్లు, రూ.62 కోట్ల అభివృద్ధి పనులు, 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలపై, ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసిన సమయంలోనే డివైడర్లను కట్టకుండా అడ్డుకున్నారని, కానీ తాను మాత్రం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా డివైడర్ల నిర్మాణం చేపట్టినట్టు గుర్తు చేశారు. అలాగే ఎంపీ అర్వింద్ తీసుకొచ్చిన నేషనల్ హైవేలు, బైపాస్‌లపై స్థానిక నేతలు స్పందించడం లేదని విమర్శించారు. యావర్ రోడ్ విస్తరణపై టిడిఆర్ తీర్మానం ఆమోదమైనా పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తూ, “చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్ విస్తరణ చేసి చూపండి” అన్నారు. యావర్ రోడ్డు విస్తరణను ఉద్దేశపూర్వకంగానే జగిత్యాల ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారని అంటూ ఆయనకు కావలసిన వ్యక్తులే బయట ప్రచారం చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.“చేతగాకపోతే అధికారంలో ఎందుకు ఉండాలి?” అంటూ ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాల నియోజకవర్గం పై ఇప్పటికైనా సవతి తల్లి ప్రేమ మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిజమైన రాజకీయాల మానుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని హితువు పలికారు.ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, ఉపాధ్యక్షులు పవన్ సింగ్, గదాసు రాజేందర్, గడ్డల లక్ష్మి, జిల్లా మహిళ మోర్చా నాయకురాలు దూరిశెట్టి మమత, సిరిపురం శ్రీనివాస్,కాశెట్టి తిరుపతి గట్టిపెల్లి జ్ఞానేశ్వర్, పూదరి శ్రీనివాస్, మధురిమ, కవిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular