నవగీతం , కోరుట్ల ప్రతినిధి(వి.సంపత్)
కోరుట్ల పట్టణంలోని లోని 27వ వార్డులో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘంలో చేయూత పెన్షన్ దారులకు ఫేస్ రికగ్నేషన్ స్కాన్ కార్యక్రమము చేపట్టినామని వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెన్షన్ దారులు వచ్చి సద్వినియోగం చేసుకున్నారని అలాగే ఈ నెలలో వికలాంగ, వృద్ధాప్య, వితంతు ,చేనేత,గీత కార్మికులు ఎవరైతే ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్నారో వారందరూ కూడా ఫేస్ రికగ్నెషన్ స్కాన్ చేయించుకోవాల్సిందిగా కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు 27వ వార్డు పెన్షన్దారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ డిప్యూటీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు మరియు వార్డు పెన్షన్ దారులు పాల్గొన్నారు.

