నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి స్వామి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్తూరి స్వామి మాట్లాడుతూ అసలు పేరు భాగయ్య భాగ్య రెడ్డి వర్మగా మార్చుకున్నారు 1888 మే 22న హైదరాబాదులో ఓ దళిత కుటుంబంలో జన్మించినారు దళిత జాతి ఆత్మగౌరవం అంటరానితనం నిర్మూలనకై బాల్యవివాహాలు జోగిని వ్యవస్థ రద్దుకై అనేక ఉద్యమాలు చేసి ఈ దేశ మూలవాసులం ఆది హిందువులం మేమే అని అనేక రాష్ట్రాలలో ఆది హిందూ మహాసభలు ఏర్పాటు చేసి దళితులను ఏకతాటిపై తేవడానికి అనేక స్వచ్ఛంద సంఘాలను ఏర్పాటు చేసి దళితులు చదువుకుంటేనే సమాజంలో అభివృద్ధి గౌరవం అని జ్యోతిబాపూలే బాటలో అంబేద్కర్ గారి కంటే ముందే ఆయన ఆలోచన పాటించి సొంత ఖర్చులతో 25 పాఠశాలలు ఏర్పాటు చేసి 2500 మంది విద్యార్థులకు విద్యను అందించిన మహోన్నత వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలను గుర్తించి హైదరాబాదులో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలు నిర్వహించాలని కోరుతూ తెలుగు నాట దళిత జాతి ఆత్మ గౌరవ పథకాన్ని రెపరెపలాడించిన భాగ్యరెడ్డి వర్మ బాటలో నేటి తరం నడవాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పర్ల పెళ్లి ప్రసాద్ రామకృష్ణ పురం సర్పంచ్ నేరెళ్ల మహేష్ తిరుమలపురం సర్పంచ్ అంజయ్య అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి కోలాపురం రమేష్ మహంకాళి గంగ రాజం కొత్తూరి అంజన్ కుమార్ గడ్డమీది గంగయ్య రామంచ లక్ష్మణ్ దుబ్బాక చందు కొత్తూరి శంకర్ పెంట రవి అశోక్ వెంట రామయ్య పర్ల పెళ్లి రవి కొత్తూరి ఆనందం తదితరులు పాల్గొన్నారు

