Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలతెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:(వి.సంపత్)

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి, భీమారం మండలాల్లో నిర్వహించిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.మొదటగా ఇటీవల మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శివగంగ కోనేరు వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన శివ, శర్విందు, మహాన్విత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో విషాదకరమని పేర్కొంటూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.తదనంతరం మేడిపల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 22 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 19 మంది లబ్ధిదారులకు రూ.5.76 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. భీమారం మండలంలో కూడా కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకాన్ని కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో రెండో దశలో మరిన్ని కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడమే కాకుండా, అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మేడిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రమేష్ రెడ్డి,భీమారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మాదం వినోద్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి చేపూరీ నాగరాజు,బలగం రాజేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుగ్గిల రమేష్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular