డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది
డ్రైవర్ అశోక్ తో ఫోన్లో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి అన్నారు. మంగళవారం డ్రైవర్ అశోక్ ను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రతి సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇలా ప్రశ్నించిన ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే డ్రైవర్ అశోక్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక నాయకుల సహకారంతో డ్రైవర్ అశోక్ తో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. పరిస్థితిపై పరిశీలన జరిపారు. పార్టీ తరపున, వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే డ్రైవర్ అశోక్ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, సుంచు సురేష్, శ్రీపతి రమేష్, పవన్ సింగ్, ఇట్యాల రాము, సిరిపురం శ్రీనివాస్ గట్టుపల్లి జ్ఞానేశ్వర్, కాసేట్టి తిరుపతి,శివ, ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

