Saturday, September 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లాపూర్ మండల టియుడబ్లుజె -హెచ్ 143 ప్రెస్ క్లబ్  ఏకగ్రీవ ఎన్నిక

మల్లాపూర్ మండల టియుడబ్లుజె -హెచ్ 143 ప్రెస్ క్లబ్  ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండల టీయూడబ్ల్యూ జె-హెచ్ 143 యూనియన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక వెంకటేశ్వర దేవాలయం లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, గంగుల రాంగోపాల్, జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షులు శిఖరి రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అంజు గౌడ్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు గా సుతరి కృష్ణమాచారి, అధ్యక్షులుగా రుద్ర రాంప్రసాద్, ఉపాధ్యక్షులు గా ఉడుగుల గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా నూనె ఆంజనేయులు, కార్యదర్శి గా మోర సతీష్, కోశాధికారి గా ఆదరి రాజేందర్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రింట్ మీడియా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్, జిల్లా కార్యదర్శి తోకల పవన్, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంబి మహేష్,తాజా మాజీ అధ్యక్షులు ముత్యాల రమేష్,ఆకుతోట నర్సయ్య, జరుపుల రమేష్, వంగ శేఖర్, దొంతి సుధాకర్, ఎగ్యారపు శ్రీనివాస్, బండారి వెంకటేష్, ముదంపల్లి మహేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular