Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి

ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి

📰 Generate e-Paper Clip

ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా

నవగీతం, ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను నిషేధం చేస్తున్నట్టు బహిరంగ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్ మాట్లాడుతూ నేటి నుండి అనగా జులై01 నుండి  ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన గ్రామాన్ని పరిశుభ్రంంగా ఉంచుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ కవర్ల సింగల్ యుజ్ ప్లాస్టిక్కు వల్ల డ్రైనేజీలు పుడకుపోవడం వల్ల మురికి నీరు నిలువ ఉండి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వివరించారు. జూలై 1 నుండి ప్లాస్టిక్ విక్రయించిన వాడిన గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించిన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటమని తెలియజేశారు.కిరాణా షాపుల యాజమానులు హోటల్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ముందుకు రావడం సంతోషంగా అన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని ప్లాస్టిక్ కవర్ల వల్ల రాబోయే అనారోగ్యాల గురించి వివరించారు. రాబోయే తరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని, భావితరాలకు ఉన్నత భవిష్యత్తు ఇచ్చేందుకు గ్రామంలో అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం గ్రామంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular