Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా శీతల భవాని పండుగ వేడుకలు

ఘనంగా శీతల భవాని పండుగ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

బంజారాల ఆరాధ్యదైవం శీతల మాత పండుగను సిరిపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో సర్పంచు లకవత్ జవహర్లాల్, కాంతి ఉప సర్పంచ్ బుక్య సంగీత, నాయకులు అర్జున్, లకవత్ సురేష్ సాగర్ రాజేందర్ విజేందర్ శంకర్ అరుణ్ టి జి యూ ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, నునావత్ రాజు కుల సంఘాల నాయకులు నునావత్ రాజు, లంబాడి సంఘాల ఐక్య అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ నునావత్ దేవదాస్ నాయక్, మాజీ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్, గోవింద్ నాయక్, విఠల్, సబావత్ మల్లేష్, ధర్మ నాయక్ తదితరులు పాల్గొని శీతల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. శీతల మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular