Tuesday, September 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅరిటాకుల్లో సంప్రదాయ విందు..వాల్గొండలో భక్తులకు అన్నదానం

అరిటాకుల్లో సంప్రదాయ విందు..వాల్గొండలో భక్తులకు అన్నదానం

📰 Generate e-Paper Clip

మల్లాపూర్, సెప్టెంబర్ 22 (నవగీతం): మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గ సేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులను క్రమపద్ధతిలో కూర్చోబెట్టి, అరిటాకుల్లో సంప్రదాయ పద్ధతిలో అన్నం, పప్పు, కూరలు తదితర వంటకాలను వడ్డించారు. అరిటాకుల్లో భోజనం చేయడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని దుర్గ సేన యూత్ సభ్యులు తెలిపారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భోజనం స్వీకరించారు. “అన్నదానం మహాదానం” అనే సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సేవా స్ఫూర్తిని చాటిచెప్పింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దుర్గ సేన యూత్ సభ్యులు సేవలందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular