Wednesday, November 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్...

నిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

📰 Generate e-Paper Clip

జగిత్యాల, అక్టోబర్08,(నవగీతం)

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన తదుపరి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా కార్యాచరణ రూపొందించుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

పాఠశాల భవన నిర్మాణంతో పాటు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా, అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు.నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం పాఠశాల నిర్మాణానికి సంబంధించిన స్థల పరిస్థితులు, నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీఓ, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular